అమరావతి నవంబర్ 25 :మన ధ్యాస న్యూస్:///

ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ , ఆయన సతీమణి కాకర్ల ప్రవీణ తో కలిసి అమరావతిలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించి, ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలియజేశారు.అదేవిధంగా అమెరికాలో ప్రముఖ వైద్యురాలిగా సేవలందిస్తున్న డా|| మిక్కిలినేని హైమావతి గారిని సీఎం చంద్రబాబు నాయుడు కి సురేష్ పరిచయం చేశారు. హైమావతి వైద్య సేవలు, సమాజపట్ల ఆమె కృషిని ముఖ్యమంత్రి ఎంతో ప్రశంసించారు. ఆమె వంటి ప్రతిభావంతులైన భారతీయులు అంతర్జాతీయ స్థాయిలో సేవలందించడం రాష్ట్రానికి గర్వకారణమని సీఎం అభినందించారు.తరువాత జరిగిన సమావేశంలో ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి గురించి ముఖ్యంగా—,సాగునీటి సమస్యల పరిష్కారం,తాగునీటి ప్రాజెక్టుల పురోగతి,పల్లెల అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల,పార్టీ సంస్థాగత బలోపేతం,వంటి అంశాలపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖ్యమంత్రికి సవివరంగా వివరించారు. ఉదయగిరి అభివృద్ధి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు కి తమ కట్టుబాటును తెలియజేసి, ప్రభుత్వ సహకారంతో మరిన్ని ప్రజాకల్పనలను అమలు చేయాలని ఆకాంక్షించారు.
