కలిగిరి, నవంబర్ 24 :మన ధ్యాస న్యూస్ ప్రతినిధి :///

  • పెద్దకొండూరు లో రైతన్నా మీ కోసం కార్యక్రమం
  • అన్నదాతలకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా కూటమి పాలన
  • ధాన్యం కొన్న 48 గంటల్లోనే నగదు జమ
  • ఎన్నికల హామీ మేరకు అన్నదాత సుఖీభవ కింద 20 వేలు అందజేత
  • రైతును రాజును చేసేలా అన్నదాతలకు పంచ సూత్రాలు
    -. టిడిపి రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు.

రైతును రాజు చేసేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంచ సూత్రాలను అమలు చేయనున్నారని టిడిపి రాష్ట్ర తెలుగు రైతు కార్య నిర్వాహ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు అన్నారు. సోమవారం కలిగిరి మండలంలోని పెద్దకొండూరు గ్రామంలో నిర్వహించిన రైతన్నా.మీ కోసం కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ప్రయోజనాలను వివరించారు. నియోజకవర్గం నుంచి అత్యధికంగా వరి మరియు మెట్ట పంటలు ఐనటువంటి పెసారా, మినుములు,పండిస్తున్న నేపధ్యంలో యూరియా కూడా అవసరమైనంత అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందాని ఆయన అన్నారు. ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన ప్రభుత్వం మనదని అన్నారు. రైతు పండించే ప్రతి గింజకు, ప్రతి పంటకు న్యాయం చేసేలా పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి 20 వేలు అందజేస్తున్నారని చెప్పారు. కూడా రైతు బిడ్డనేనని, ఆయన అన్నారు.రానున్న 5 సంవత్సరాల్లో రైతును రాజును చేసేలా సీఎం చంద్రబాబు పంచ సూత్రాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. డిమాండ్ ఆధారిత పంటలను పండిస్తే రైతులకు లబ్ధి చేకూరుతుందని, ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సాగుకు టెక్నాలజీ తోడైతే రైతులకు తిరుగుండదని, అందుకే అగ్రిటెక్ ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్నారన్నారు. యువత టెక్నాలజీని అనుసంధానం చేసి వ్యవసాయం సులభతరం చేయాలన్నారు. అధికారులు కూడా రైతులకు టెక్నాలజీపై అవగాహన కల్పించాలన్నారు. అధికారులు సమర్థవంతంగా పని చేస్తున్నారని చెప్పారు. ఫుడ్‌ ప్రాసెసింగ్ రంగంలో ఎంట్రప్రెన్యూర్‌లకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, సీఎం చంద్రబాబు ఆలోచనలతో యువత ముందుకు వచ్చి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్లు ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు. ప్రభుత్వం నుంచి రైతులకు ఎల్లప్పుడూ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. రైతులకు ఎప్పుడు ఏం చేయాలో సీఎంకు చంద్రబాబు కు బాగా తెలుసని వివరించారు.గుడ్ల ఉత్పత్తిలో దేశంలో రాష్ట్రం మొదటి స్థానాన్ని కొనసాగిస్తూనే, మెరుగైన పౌల్ట్రీ పాలసీని (2025 -2030) తీసుకొస్తున్నామన్నారు. పాడి పరిశ్రమ ప్రోత్సాహకానికి గ్రామీణ ప్రాంతాలలో పశువులకు నీటి తొట్టెల నిర్మాణం, మెరుగైన వసతి గృహాలు (గోకులాలు), పశుగ్రాసాల పెంపకం, పశుదాణా పంపిణీ, ఆరోగ్య పరిరక్షణకు అన్ని రకాల టీకాలు అందిస్తున్నారని చెప్పారు. సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నారని చెప్పారు. తల్లికి వందనం, స్త్రీ శక్తి-ఉచిత బస్సు, దీపం-2, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, 20 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సీ, అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేర్చుతున్నారని చెప్పారు. ఇలాంటి మంచి ప్రభుత్వానికి అన్నదాతలందరూ తోడ్పాటును ఇవ్వాలని కోరారు. APAIMS యాప్‌ ద్వారా రైతులు ఎప్పటికప్పుడు సమాచారం పొందాలన్నారు. లేదా వ్యవసాయాధికారుల దగ్గరికి వెళ్లి ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మొక్కా హాజరాత్ రావు, పంచాయతీ సెక్రెటరీ షేక్ ముక్తార్, రైతులు, గ్రామ వ్యవసాయ సహాయకులు,గ్రామ పశు సంవర్ధక సహాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *