బంగారుపాళ్యం, మన ధ్యాస,నవంబరు25.

చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యం మండలం, మొగిలి పంచాయితీలోని వినాయకపురం గ్రామంలో స్థానిక నాయకులు త్యాగరాజులు మరియు బంగారుపాళ్యం మండల యువత అధ్యక్షులు గజేంద్ర ఆధ్వర్యంలో అలాగే యువత అందరూ కలిసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్సీపి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.