కలిగిరి నవంబర్ 24 మన ధ్యాస న్యూస్ ప్రతినిధి:///

కలిగిరి మండలం, కృష్ణారెడ్డిపాలెం పంచాయితీ పరిధిలోని రాజుపాలెం ఎస్సీ కాలనీలో నివసిస్తున్న గుర్రం వెంకటయ్యకు కళ్ళు పూర్తిగా కనిపించక జీవనం సతమాతమవుతూ, ఆర్దిక ఇబ్బందులు ఉన్న విషయమును స్థానిక నాయకుల ద్వారా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కి తెలిసింది. ఈ విషయాన్ని తెలిసిన వెంటనే ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హృదయపూర్వకంగా స్పందించి, బాధిత కుటుంబానికి సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు.కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆర్థిక సహాయంగా రూ.5,000 మొత్తాన్ని గుర్రం వెంకటయ్యకు అందజేసి, వారి కష్టకాలంలో తోడుగా నిలిచిన ఎమ్మెల్యే గారి సేవాభావమును గ్రామస్తులు కొనియాడారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *