-రైతన్న మీకోసం కరపత్రాలను పంపిణీ చేస్తున్న వరికుంటపాడు టిడిపి నాయకులు..

వరికుంటపాడు నవంబర్ 24:-మన ధ్యాస న్యూస్ ప్రతినిధి://

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల సంక్షేమం కోసం ప్రతినిత్యం పాటుపడుతున్నారని రైతును రాజును చేసేందుకు ఐదు విధానాలతో కార్యాచరణను అమలు చేశారని టిడిపి మండల కన్వీనర్ చండ్రా మధుసూదన్ రావు అన్నారు. మండల కేంద్రమైన వరికుంటపాడు లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి రైతన్న మీకోసం కరపత్రాలను పంపిణీ చేసి కూటమి ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే విధంగా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చిరుధాన్యాలు అయినటువంటి రాగులు జొన్నలు సజ్జలు కొర్రలు వంటి సాగు మరింత పెరగాలని ప్రకృతిలో వచ్చే వాతావరణ మార్పులను తట్టుకునేలా వ్యవసాయ అధికారులు సూచనలు అందించాలన్నారు. రైతుల కోసం సబ్సిడీపై కిసాన్ డ్రోన్ లను అందజేస్తుందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీతో డ్రిప్పు స్పింకులర్లను అందజేస్తుందన్నారు. 13 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో 38 ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఉండే ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా రెండు విడతల్లో ఒక్కొక్కరికి 14 వేలవంతున రైతు ఖాతాలో నగదు జమ చేయడం జరిగిందన్నారు. పాడి రైతుల కోసం పశుగ్రాసాల పెంపకం, గోకులం షెడ్లు, పశువుల దాన పంపిణీ ఆరోగ్య పరిరక్షణకు అన్ని రకాల కేకలను ఇంటి వద్దకే వచ్చి పశువైద్య సిబ్బంది పాడి రైతులకు అవగాహనలు కల్పించడం జరిగిందన్నారు. సూపర్ సిక్స్ అహమీలలో భాగంగా ప్రతి హామీని అమల్లోకి తీసుకొని వచ్చామని గడిచిన 17 నెలల కాలంలో సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవానికి ఇల్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ప్రతి ఒక్కరూ ఇంటి కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రావిళ్ళ నాగేంద్ర, సొసైటీ అధ్యక్షులు గుర్రం గోపి, క్లస్టర్ ఇంచార్జి పోక మహేష్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ యాదవ్, మండల తెలుగు యువత అధ్యక్షులు లక్ష్మీనారాయణ, గ్రామ పార్టీ అధ్యక్షులు పొద మాధవరావు, సొసైటీ డైరెక్టర్ మానం కొండలరావు, మేడిద వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ ఆండ్రా బాల గురువారెడ్డి, జనసేన అధ్యక్షులు పఠాన్ రసూల్, కొత్తులూరి మహాదేవ, ఆవుల అరుణమ్మ, లింగం మాలకొండయ్య, ఎల్లారెడ్డి, చంచల బొజ్జయ్య, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కేశవులు, మానం నిఖిల్, నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *