టిడిపి రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు..!!

ఉదయగిరి, నవంబర్ 24 మన ధ్యాస న్యూస్ ://

ఉదయగిరి నియోజకవర్గం లోని ఎనిమిది మండలాలలోని అన్నీ గ్రామాల లో నివసించే నిరుపేదలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఒక మంచి వరం కల్పించారు. ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించారు,ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సారధ్యంలో నూతన ఇల్లు మంజూరుకు ప్రభుత్వం దరఖాస్తుకు అవకాశం కల్పిస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం 2లక్షల 50 వేల రూపాయలు మంజూరు చేస్తుందని ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలలో గ్రామాలలో ఇల్లు లేని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు స్థానికంగా సచివాలయంలో ఉద్యోగస్తులు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ద్వారా దరఖాస్తు చేసుకొనుటకు అవకాశం కల్పిస్తుందని లబ్ధిదారులు అధికారులను స్థానిక నాయకులను సంప్రదించి నవంబర్ 30 వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇల్లు నిర్మించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సారధ్యంలో నూతన ఇల్లు మంజూరు చేసుకోవడానికి వచ్చినటువంటి అవకాశాన్ని ఉదయగిరి నియోజకవర్గం లోని 8 మండలంలో ని అన్నీ గ్రామాల ప్రజల సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *