వింజమూరు నవంబర్ 21 మన ధ్యాస న్యూస్ ://
ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ లక్ష కార్డుల ఉద్యమంలో భాగంగా ఏపీ దళిత మహాసభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కత్తి పద్మారావు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేయాలని కోరారు అంతే కాకుండా ఆరవ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు పాఠ్యాంశంగా చేయాలన్నారు.అలాగే అంబేద్కర్ స్మృతివనాలు అధ్యయన కేంద్రాలు ప్రతి పంచాయతీలోనూ ఏర్పాటు చేయాలని అమరావతిని 1000 కోట్లతో అంబేద్కర్ బౌద్ధ క్షేత్రం గా తీర్చిదిద్దాలని అలాగే విజయవాడలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలోనూ ప్రభుత్వ కార్యాలయంలో బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచాలని తెలిపారు.ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ జాతీయ అవార్డులు సముచితమైన రీతిలో ప్రకటించాలని భారత రాజ్యాంగ పీఠికను అన్ని పాఠశాలల అసెంబ్లీలో చదవడం తప్పనిసరి చేయాలని కోరారు అదేవిధంగా సంపూర్ణ మద్యపాన నిషేధం వైపు ప్రభుత్వం అడుగులు వేయాలని అంబేద్కర్ రచనలు ప్రసంగాలను తెలుగులోకి అనువదింపజేసి ప్రచురించాలని కులాంతర వివాహితులకు రక్షణ 10 లక్షల పారితోషికం గృహవసతి ఉద్యోగ వసతిని కల్పించాలని 1989 ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్టును పక్కాగా అమలు జరపాలని ప్రత్యేక కోర్టుల ద్వారా దళితులపై జరుగుతున్న దాడులను అత్యాచారాలను వెంటనే విచారణ జరిపి శిక్షలు అమలు చేయాలని తెలిపారు పై అంశాలను పరిశీలించి ఆచరణ బద్ధమైన చట్టం తేవాలని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ మరియు సామాజిక సాంస్కృతిక అంబేద్కర్ సంఘాల ఆకాంక్షలను అమలుకు కృషి చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రంలో దళిత నాయకులు వాగాల పెంచలయ్య మాట్లాడుతూ నేటి తరానికి అంబేద్కర్ యొక్క క్రియాశీలత, ఆయన చేసిన త్యాగాలు, రాజ్యాంగ నిర్మాత గా ఆయన రచించిన రాజ్యాంగం విలువలు గురించి తెలియజేయడం, సామాజిక బాధ్యత గల ప్రతి పౌరుడి ప్రథమ కర్తవ్యం అని ఆయన అన్నారు. అందులో భాగంగా నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పంపే లక్ష కార్డుల ఉద్యమంలో భాగమైనందుకు గర్వపడుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో దళిత సీనియర్ నాయకులు వాగాల పెంచలయ్య, సీనియర్ పాత్రికేయులు సాదం వెంకట నరసింహులు, దళిత యాక్టివిస్టులు, మురా పెద్దన్న, ఆరికొండ శ్రీనివాసులు, గుజ్జు చెన్నయ్య, సాధం అజయ్ శ్రీనివాస్, అమడాల వంశీ, నాగదాసరి కృష్ణ, నీసు కేశవలు, శ్రీరామ్ శ్రీనివాసులు, బోదాల ప్రేమ్ దాస్ తదితరులు పాల్గొన్నారు.