మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఇందిరా గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం నాయకులు మాట్లాడుతూ..ఇందిరా గాంధీ ధైర్యసాహసాలు, భారత అభివృద్ధికి చేసిన కృషి చిరస్థాయిగా నిలుస్తాయనీ అన్నారు. ఆమె దేశ భద్రతపైన చూపిన ప్రత్యేక శ్రద్ధ నేటి తరాలకు ఆదర్శం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చిప్ప మోహన్,మల్లప్ప పటేల్,కల్లూరి పండరి,బస్వరాజ్ దేశాయ్,సంతోష్ దేశాయ్,మొగలాగౌడ్,షేక్ చాంద్ పాషా,కల్లూరి బాల్ రాజ్, జిన్నరాములు,చప్టే నాగు,కృష్ణమూర్తి,అంజాగౌడ్, కాశి నాయక్,సంగమేశ్,రఫీ,ఇస్మాయిల్, హనుమంత్ రావ్ తదితరులు పాల్గొన్నారు.









