కావలి, నవంబర్ 10: మన ధ్యాస న్యూస్://
కావలి పట్టణంలోని ఏటూరి రామిరెడ్డి తోటలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న కాపుల కార్తీక వన భోజన మహోత్సవ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ని కాపు సంఘ నాయకులు ఆహ్వానించారు.ఈ సందర్భంగా కాపు సంఘ ప్రముఖులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలసి, కార్యక్రమానికి ఆహ్వానిస్తూ వివరణాత్మకంగా వివరించారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు.కార్యక్రమం విజయవంతం కావాలని ఎమ్మెల్యే ఆకాంక్షిస్తూ, కాపు సమాజం ఐక్యతగా, సమగ్రాభివృద్ధి దిశగా ముందుకు సాగాలని సూచించారు. కాపుల సాంస్కృతిక విలువలు, సామాజిక ఐక్యతకు ఈ వనభోజనాలు వేదికగా నిలుస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో కాపు నేతలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.










