మన న్యూస్, నవంబర్ 10 ఉదయగిరి, ://
ఉదయగిరి పోలీస్ సర్కిల్ పరిధిలో నీ వరికుంటపాడు దుత్తలూరు మండలాల్లో సిఐ వెంకట్రావు నేతృత్వంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఇసుకపల్లిలో పేకాట ఆడుతున్న ఐదుగురు ని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 4,710 రూపాయలు నగదు ను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కోటి వర్ధన పల్లిలో కోడిపందాల స్థావరాలపై దాడులు నిర్వహించి ఐదుగురిని అరెస్టు చేసి 3 కోళ్లు 3 బైకులు 5000, రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు.దుత్తలూరు బీసీ కాలనీలో నలుగురు అరెస్ట్ చేసి 6000, నగదు స్వాధీనం చేసుకున్నారు.









