సీతారామపురం, నవంబర్ 09 :(మన ధ్యాస న్యూస్ )://
మాజీ రాష్ట్ర శాప్ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అగ్ర నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తో ఆదివారం హైదరాబాదులోని ఆయన నివాసంలో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు ఊటుకూరు నాగార్జునతో కలిసి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ జాయింట్ సెక్రటరీ పాలగిరి ముద్దుకృష్ణమరాజు మర్యాదపూర్వక భేటీ అయ్యారు. ముందుగా బైరెడ్డి కి శాలువా కప్పి పుష్ప గుచ్చం అందించారు. ఈ సందర్భంగా పాలగిరి ముద్దుకృష్ణమరాజు మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి, యువ నాయకుడు మేకపాటి అభినవ్ రెడ్డిల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ నిర్వహించబోయే సమావేశాలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాల ప్రణాళికల గురించి చర్చించామన్నారు. రాబోయే 2029 ఎన్నికలలో ఉదయగిరి నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని భాగస్వామ్యం కావాలని, యువత ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొనాలని కోరామన్నారు. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం, యువతలో ఉత్తేజం తీసుకొచ్చే అంశాలు అదేవిధంగా తదితర రాజకీయ అంశాలపై చర్చించామన్నారు. కార్యక్రమంలో మండల వైసీపీ యూత్ నాయకులు కప్ప ప్రదీప్, సురేంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు.










