

మన న్యూస్: ప్రతినిధి డిసెంబర్ 7 జోగులాంబ గద్వాల జిల్లా మనవపాడు మండల కేంద్రంలో ఒక వారణాసి శూనకాలకు పాలు ఇస్తూ ఈ విచిత్రం కనిపించింది మనషులలో జన్మ ఇచ్చిన తల్లికి ఉండునేమో నాకొడుకు నా కుమార్తె నా ఫ్యామిలీ అనే బేధాలు కానీ మాకు ఎలాంటి బేధాలు ఉండవని నిరూపిస్తుంది ఈ వారణాసి ఈనాటి కాలంలో మనం చూస్తున్నాం మనషులమైన మనం ప్రేమ ఆప్యాయత లు మరిచి నా జాతి గొప్ప అంటే నా జాతి గొప్ప అంటూ ద్యేషాలు పెంచుకుంటూ కొట్టుకు చస్తున్నాం కుట్రలు కుతంత్రాలు పెట్టుకొని ఈ లోకంలో మనుషులు భ్రమలో బ్రతుకుతున్నాం
కానీ ఈ చిత్రం చూస్తుంటే మనషుల కంటే జంతువులే మేలు అనిపిస్తుంది వాటికి లేవు జాతులు, వాటికి లేవు ద్యేషాలు, వాటికి లేవు కుళ్ళు కుతంత్రాలు, ఇవి ఏవి లేవు కాబట్టే శూనకాలకు ఒక తల్లిలా పాలు ఇస్తుంది ఈ చిత్రాని చూసైనా నేర్చుకుందాం మనమందరం ఒక్కటే జాతి అదే మానవజాతి అందుకే అందరం బ్రతికినంత కాలం మనమందరం ఐక్యమంతంగా ఉందాం