మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 37,113 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, వీర్ నంబర్–5 కలో ఉన్న ఐదు గేట్ల ద్వారా 43,135 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఏఈ సాకేత్ తెలిపారు.దీంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో నీటి ప్రవాహం పెరుగుతుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఎవరూ ప్రవాహ ప్రాంతాల వైపు వెళ్లకూడదని ఆయన హెచ్చరించారు.ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405.67 అడుగులు కాగా,ప్రస్తుతం 17.802 టీఎంసీలకు గాను 17.325 టీఎంసీల నీరు నిల్వగా ఉందని ఏఈ సాకేత్ వివరించారు.









