

మన న్యూస్, చిత్తూరు :- చిత్తూరు పరిధిలోని ముత్తిరేవుల వద్ద క్రీడా మైదానాన్ని చిత్తూరు మాజీ ఎమ్మెల్యే తెదేపా సీనియర్ నాయకులు సీకే బాబు గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు మంచి శారీరక దృఢత్వం పొందాలంటే వివిధ రకాల క్రీడలలో నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ శారీరక దృఢత్వం పొందాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం అన్ని రంగాల వారు వివిద రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అలాంటివారు మానసిక ఉల్లాసం కొరకు క్రీడలలో పాల్గొని మంచి ఆరోగ్యాన్ని పొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు…