అక్రమ అరెస్ట్‌లు ఆపాలి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి

మన న్యూస్: పినపాక, ప్రభుత్వ పధకాల అమలు చేయాలని డిమాండ్‌ చేసిన బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావును అరెస్ట్‌ చేయడం అక్రమమని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్‌రెడ్డి అన్నారు. గురువారం ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని తరుచూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతొ అధికారంలో ఉంది కదా అని పార్టీ నాయకులను కక్షపూరితంగా అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులపై పోలీసులు అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం సంక్షేమ పధకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయిందన్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో ప్రజల కోసం ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం తట్టుకోలేక అక్రమ కేసులు పెట్టిస్తుందన్నారు. రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ది చెప్తారన్నారు.
ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు కోలేటి భవానీ శంకర్‌, పొనుగోటి భధ్రయ్య, సొసైటీ చైర్మన్‌ రవివర్మ, మాజీ ఎంపీపీ గుమ్మడి గాంధీ, మండల నాయకులు సాగిరాజు బుల్లిబాబు, ముక్కు వెంకటేశ్వరెడ్డి, కామేశ్వరరావు, షేక్‌ జహంగీర్, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వహించాలని, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్.

    మన ధ్యాస,నారాయణపేట జిల్లా:- పరిధిలోని మఖ్తల్ పట్టణ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్‌గా ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ విధులు స్వీకరించిన అనంతరం మంగళవారం ఉదయం మఖ్తల్ పట్టణం 10వ వార్డు అంబేద్కర్ నగర్ ప్రాంతంలో పర్యటించి పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా…

    800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు,జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో, నిస్పక్షపాతంగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐ పి ఎస్ పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల.

    సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల.