
మన న్యూస్: పినపాక, ప్రభుత్వ పధకాల అమలు చేయాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావును అరెస్ట్ చేయడం అక్రమమని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్‌రెడ్డి అన్నారు. గురువారం ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని తరుచూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతొ అధికారంలో ఉంది కదా అని పార్టీ నాయకులను కక్షపూరితంగా అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులపై పోలీసులు అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం సంక్షేమ పధకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయిందన్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో ప్రజల కోసం ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం తట్టుకోలేక అక్రమ కేసులు పెట్టిస్తుందన్నారు. రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ది చెప్తారన్నారు.
ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు కోలేటి భవానీ శంకర్, పొనుగోటి భధ్రయ్య, సొసైటీ చైర్మన్ రవివర్మ, మాజీ ఎంపీపీ గుమ్మడి గాంధీ, మండల నాయకులు సాగిరాజు బుల్లిబాబు, ముక్కు వెంకటేశ్వరెడ్డి, కామేశ్వరరావు, షేక్ జహంగీర్, తదితరులు పాల్గొన్నారు.