అంబేద్కర్ విగ్రహానికి నిప్పు కేసులో టిడిపి నేతలపై కుట్ర!– టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి

వెదురుకుప్పం,మన ధ్యాస ,అక్టోబర్ 16 :చిత్తూరు జిల్లా దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన కేసులో టిడిపి నేతలను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వెదురుకుప్పం పోలీసులు వికృతంగా వ్యవహరిస్తున్నారని, ముగ్గురు కానిస్టేబుళ్లు దేవళంపేటకు చెందిన అరుణ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని తప్పుడు సాక్ష్యం చెప్పించే ప్రయత్నం చేశారని తెలిపారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మరియు వైసిపి నుంచి టిడిపిలో చేరిన కొందరు కోవర్టులతో పోలీసులు చేతులు కలిపి చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.సోమవారం రాత్రి తిరుపతిలో నివాసం ఉన్న యువకుడు అరుణ్‌ను వెదురుకుప్పం పోలీసులు తీసుకెళ్లి, తీవ్రమైన హింసకు గురి చేశారని తెలిపారు. టిడిపి నేతలు కిషన్ చంద్, సతీష్ నాయుడు ప్రేరణతో తాగి విగ్రహానికి నిప్పు పెట్టినట్టు చెప్పాలని బలవంతం చేశారని, అంగీకరించకపోవడంతో కాళ్లకు గొలుసులు వేసి, కిటికీలకు కట్టేసి, కర్రలతో సీసీ కెమెరాలు లేని చోట కొట్టారని సుధాకర్ రెడ్డి తెలిపారు.అయన వివరించిన మేరకు, కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోవడంతో బుధవారం పోలీసులు అరుణ్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ యువకుడు తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు.ఈ కుట్ర వెనుక మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, వైసిపి నుంచి టిడిపిలో చేరిన కోవర్టుల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. పోలీసులు రూ.10 లక్షలు తీసుకుని ఈ నాటకానికి వేదికయ్యారని ప్రజలు మాట్లాడుకుంటున్నారని తెలిపారు.“న్యాయం జరిగే వరకు మేము మౌనం పాటించము. ఉన్నతాధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేసి, నిందిత పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ కుట్ర వెనుక ఉన్నవారి అసలు ముఖాలు బయటపెట్టాలి,” అని డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.– డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డిటిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి

  • Related Posts

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!