- కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ సామ్యూల్..
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో మనోహరం, క్రైస్తవుల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని శంఖవరం మండల పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దడాల యాకోబు కొనియాడారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం సభ్యులు గురువారం కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ సామ్యూల్ ను, కేటీసీ విద్యాసంస్థల అధినేత ప్రవీణ్ చక్రవర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన శంఖవరం మండల పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు అభినందనలు తెలిపారు. అనంతరం శంఖవరం మండల పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దడాల యాకోబు మాట్లాడుతూ, కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ సామ్యూల్ పాస్టర్ల సహవాసం కలిగి ఉండాలని, సేవకుల పరిచర్య, కుటుంబ పరిస్థితులను గుర్తించి సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. అనంతరం ఫెలోషిప్ అభివృద్ధిపై పలు సలహా సూచనలు అందించారు. మండలంలో పాస్టర్ల అభివృద్ధిపై దృష్టి సారించాలని కేటీసీ విద్యాసంస్థల అధినేత ప్రవీణ్ చక్రవర్తి తెలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో శంఖవరం మండల పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వి ఎస్ ప్రకాష్, సెక్రటరీ దడాల జాన్సన్, కోశాధికారి ఎ. ప్రసాద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.







