- టీడీపీ నేత పర్వత సురేష్
శంఖవరం/ మనధ్యాస ప్రతినిధి (అపురూప్) :కూటమి ప్రభుత్వం ప్రజాభివృద్ధికి తోడ్పడుతుందని, నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఎమ్మెల్యే వరపుల సత్య ప్రభ రాజా ముందంజలో ఉన్నారనిప్రత్తిపాడు నియోజకవర్గం టిడిపి సీనియర్ నేత పర్వత సురేష్ అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరంలోని టిడిపి నేత పర్వత సురేష్ గృహంలో టిడిపి మండల అధ్యక్షుడు ఈగల దేవుళ్ళు అధ్యక్షతన గురువారం సాయంత్రం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టిడిపి సీనియర్ నేత పర్వత సురేష్, టిఎన్టీయుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రాష్ట్ర రోడ్డు డవలప్మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ వెన్నా శివ, టిడిపి మండలం పూర్వ అధ్యక్షుడు బద్ధి రామారావు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా పర్వత సురేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ, యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తూ ప్రజలు కన్న కలలను కూటమి ప్రభుత్వం సాకారం చేస్తుందని, దశాబ్దాల కాలంగా నెలకొన్న సమస్యలను ప్రజల ఆశయాలు, ఆశలకు అనుగుణంగా నెరవేరుస్తూ, ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పని చేస్తున్నారన్నారు. ఇప్పటికే ప్రజా సంక్షేమం కోసం, నియోజకవర్గం అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ మంత్రులను, అధికారులను సమన్వయం చేసుకుంటూ తన శాయశక్తుల కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ శంఖవరం నుండి రౌతులపూడి వరకు గల 6 కిలోమీటర్ల బిటి రోడ్డుకు 3కోట్ల 50 లక్షల రూపాయులు మంజూరు చేయడం హర్షనీయమని, ఎమ్మెల్యే సత్యప్రభకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే శంఖవరం మండలంలోని గౌరంపేట నుండి మాసంపల్లి, పెద్దిపాలెం రోడ్లను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. దశాబ్ద కాలంగా గిరిజనులు రవాణాసౌకర్యం కోసం ఎదురు తెన్నులు చూస్తూండగా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు శంఖవరం నుండి వేళంగి వరకు నూతన రహదారి నిర్మించి, సూపర్ సిక్స్ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్నిదేనని సురేష్ పేర్కొన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,రాష్ట్ర రోడ్డు డవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నా (ఈశ్వరుడు) శివ మాట్లాడుతూ, యువత ఆశల హరివిల్లుగా పేరుగాంచిన మంత్రి నారా లోకేష్ తన శాయశక్తుల కృషి చేస్తూ అనేక కంపెనీలను ప్రోత్సాహించి, రప్పించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని దేశంలో అగ్రగామిగా నిలిపేందుకు మంచి విజన్ తో అభివృద్ధి చేస్తున్నారన్నారు. ప్రజల ఆకాంక్షను ఇచ్చిన మాటను నిలబెట్టుకునేది కూటమి ప్రభుత్వమే నని అన్నారు. అనంతరం ఇటీవల నూతనంగా పదవులు అలంకరించిన రాష్ట్ర రోడ్డు డవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నా శివ, పార్టీ మండల అధ్యక్షుడు ఈగల దేవుళ్ళు, ప్రత్తిపాడు మార్కెట్ కమిటీ అధ్యక్షులు బద్ధి మణి రామారావు లను పర్వత సురేష్ సాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టిడిపి నేతలు బొర్రా వాసు, వర ప్రసాద్, జట్లా శ్రీను, రౌతు శ్రీను, పిల్లా గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.







