మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )
పిట్లం మండల కేంద్రంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు అడ్వకేట్ రాంరెడ్డి స్వగృహంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఆకర్షితులైన పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా అడ్వకేట్ రాంరెడ్డి నూతనంగా పార్టీలో చేరిన యువకులు సాయిలు,బక్క రమేష్,వడ్డేపల్లి రమేష్,బక్క గంగారాం,రవికుమార్, రాజు,దేవయ్య,కృష్ణలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి, వారిని సాదరంగా ఆహ్వానించారు.యువకులు మాట్లాడుతూ పిట్లం మండల కేంద్రంలోని ఎస్సీ వాడలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, కొత్త రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్, సన్నబియ్యం వంటి పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలుమెరుగుపడ్డాయని, ఈ సంక్షేమ పాలనతో ప్రేరణ పొంది పార్టీ జెండా కింద పనిచేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఇమ్రాస్,
ఎస్సీ సెల్ అధ్యక్షులు బాలరాజ్, లక్ష్మణ్, బాలు, నగేష్ తదితరులు పాల్గొన్నారు.








