మన ధ్యాస, నిజాంసాగర్ :,( జుక్కల్ )
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిజాంసాగర్ మాజీ జడ్పీటీసీ మల్లూర్ కృష్ణా రెడ్డిని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పరామర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాంతారావు మాట్లాడుతూ, కృష్ణా రెడ్డి గారు త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు రావాలి అని ఆకాంక్షించారు.
పార్టీకి ఆయన సలహాలు, సూచనలు ఎంతో అవసరమని,రాబోయే తరాలకు మార్గదర్శకులుగా నిలవాలని ఎమ్మెల్యే అన్నారు.








