

పినపాక నియోజకవర్గం , మన న్యూస్:: ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచి, తగినంత మంది సిబ్బందిని నియమించి, ప్రజల రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపందా) మణుగూరు డివిజన్ కార్యదర్శి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్. మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం మణుగూరు ఆర్టీసీ డిపో మేనేజర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న జనాభా కనుగుణంగా ప్రజల రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం కోసం ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచి, తగినంత మంది సిబ్బందిని నియమించవలసిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా బస్సులను తగ్గించడం వలన, తగినంత మంది సిబ్బందిని నియమించకపోవడం వలన, మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తగినంత బస్సుల సంఖ్య లేకపోవడం వలన అనేక గ్రామాలకు రవాణా సౌకర్యం లేకుండా పోయిందన్నారు. ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచి, తగినంత మంది సిబ్బందిని నియమించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని, రవాణా సౌకర్యం లేని అన్ని గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపందా ) మండల నాయకులు పి. సంజీవరెడ్డి, ఎం. లక్ష్మణ్, కురసం. రామకృష్ణ, ఎం. బొజ్జ,నందు, రాజు, నాగేశ్వరరావు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు