

పినపాక, మన న్యూస్:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. ఐదు సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించింది. కొత్తగూడెం తో పాటు మణుగూరు, పినపాక, కరకగూడెం మండలాలలో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. బుధవారం ఉదయం 7:26 నిమిషాలకు భూమి కంపించింది. ఊహించని విధంగా ఈ ప్రకంపనల చోటు చేసుకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు . రెక్టార్ స్కేల్ పై 5.3 భూకంప తీవ్రత నమోదయింది.