నెల్లూరు, సెప్టెంబర్ 29 :(మన ధ్యాస న్యూస్ :):////

నెల్లూరు జిల్లా సంయుక్త కలెక్టర్ మరియు అదనపు జిల్లా మెజిస్ట్రేట్‌గా కొత్తగా విధులు చేపట్టిన మొగలి వెంకటేశ్వర్లు ఐఏఎస్ ని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై అధికారితో చర్చించారు.అనంతరం శాసనసభ్యులు కాకర్ల సురేష్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని, అధికారులతో సమన్వయం కలిగి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అధికార యంత్రాంగం కూడా ప్రజా సేవలో మరింత పారదర్శకత, వేగం చూపించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *