
మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ )
జుక్కల్ నియోజకవర్గంలో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సోమవారం మహమ్మద్ నగర్ మండలం లోని తుంకిపల్లి కోమలంచ గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని సందర్శించి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ -అమ్మవారి ఆశీస్సులతో జుక్కల్ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఆరోగ్యంగా జీవించాలని,రైతులు మంచి పంటలు పండించుకొని అభివృద్ధి సాధించాలని కోరుకున్నాను.దేవి దుర్గామాత భక్తులకు శక్తి,ధైర్యం ప్రసాదిస్తుంది.నవరాత్రి ఉత్సవాలు మన సంస్కృతికి ప్రతీక,ఇవి ప్రజలలో ఐకమత్యం,సాంస్కృతిక విలువలను పెంపొందిస్తాయి అని అన్నారు.అలాగే, ప్రభుత్వం ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తుందని,అభివృద్ధి కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండి ప్రజలకు మరింత సేవలు అందిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అనంతరం యూత్ సభ్యులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావుకు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్, మహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ నర్సింలు, యువజన యూత్ అధ్యక్షులు మల్లయ్య గారి ఆకాష్ ,నాయకులు సాయి పటేల్, నాగభూషణం గౌడ్,ఖాళీక్, ఇఫ్తేకార్,గంగి రమేష్,కాశయ్య,హరిన్,తోట రాజు, యూత్ అధ్యక్షులు సంతోష్ రాథోడ్, తదితరులు ఉన్నారు.
