వింజమూరు సెప్టెంబర్ 28:(మన ధ్యాస న్యూస్:)////

ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారమైన, అర్ధరాత్రి అయినా పర్వాలేదు అంటూ, వింజమూరు లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించారు. ముఖ్యంగా కలిగిరి, వరికుంటపాడు, కొండాపురం, మండలాలు మరియు వింజమూరు మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ప్రజల వద్ద నుండి నేరుగా అందిన ఫిర్యాదులు, అభ్యర్థనలు, అభిప్రాయాలను అత్యంత శ్రద్ధగా పరిశీలించి, వాటి పరిష్కారానికి సంబంధించిన అధికారులను వెంటనే సంప్రదించి, త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.గ్రామ సమస్యలను మండల స్థాయిలో పరిష్కరించుకోవాలని పరిష్కారం కానీ సమస్యలను తమ వద్దకు తీసుకురావాలని ఎమ్మెల్యే తెలిపారు. నాయకుల సమన్వయం తో పార్టీని ముందుకు నడిపించాలన్నారు. చిన్న చిన్న మనస్పర్ధలు పెట్టుకుని పార్టీకి నష్టం కలిగిస్తే సహించనని హెచ్చరించారు. అందరం కలిసికట్టుగా ఉదయగిరి నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపిద్దామని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *