వింజమూరు సెప్టెంబర్ 26 :(మన ధ్యాస న్యూస్, ప్రతినిధి):///
వింజమూరు మండలం ఊటుకూరు పంచాయతీలో వైద్య మరియు ఆరోగ్య సిబ్బందితో కలిసి, మహిళల సంపూర్ణ ఆరోగ్యం కొరకు “స్వస్త్ నారి-సశక్త పరివార్ అభియాన్” (ఆరోగ్యవంతమైనమహిళ- శక్తి వంతమైన కుటుంబం) ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ముందుగా వైద్య ఆరోగ్య ప్రతిజ్ఞను చేయించారు. అనంతరం వైద్యాధికారి మస్తాన్ మాట్లాడుతూ… గ్రామాల్లో జరుగుతున్న వైద్య శిబిరాలు వలన మహిళల్లో వివిధ రకాలైన వ్యాధుల గురించి అవగాహన కల్పించి, వైద్య చికిత్సలు చేయటం జరుగుతుందని, వ్యాధుల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి, వైద్య శిబిరంలో రోగులకు వైద్య పరీక్షలు చేయడం జరిగిందని తెలిపారు శిబిరానికి వచ్చిన రోగులను పరీక్షించి అవసరమైన వారికి మందులు అందజేశారు శిబిరంలో ముఖ్యంగా ఎత్తు వయసుకు వచ్చిన బాలికలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన నియమాలను గురించి తెలియజేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో,సర్పంచ్ రొడ్డా. వెంగమ్మ, మాజీ ఎంపీటీసీ సభ్యులు కొండయ్య, బీజేపీ మండల అధ్యక్షులు మధు యాదవ్, రమేష్, సిహెచ్ఓ సక్కుబాయి హెచ్ ఈ వెంకటసుబ్బయ్య సూపర్వైజర్ వెంకటరెడ్డి లీలమ్మ ఎం ఎల్ హెచ్ పి సునీత,జానకి, , ఏఎన్ఎం లు, మానస,విజయశ్రీ, అరుణ, ఆరోగ్యకార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, అమ్ములు, లక్ష్మమ్మ, నయోమి,అంగన్వాడి కార్యకర్తలు విజయ, శుభరత్తమ్మ, చెన్నమ్మ, రాధా, సుజాత,,స్వచ్ భారత్, పుల్లయ్య , గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.