ఉదయగిరి, సెప్టెంబర్ 26 :(మన ద్యాస న్యూస్ న్యూస్):////
నియోజకవర్గం కేంద్రమైన ఉదయగిరి లోని రిటైర్డ్ ఫిజిక్స్ లెక్చరర్ ఆకుల నరసింహా రెడ్డి పదవీవిరమణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రియతమ ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి.ఆకుల నరసింహారెడ్డి ని ఘనంగా సన్మానం చేసి, ఆయన విద్యార్దులకి చేసిన సేవలు కొనియాడిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి .ఈ సందర్భంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ,వెనుకబడిన ఉదయగిరి నియోజకవర్గం లో విధ్య ద్వారానే వెనుకబడిన కుటుంబాలు బాగుపడుతాయని తలచి నియోజకవర్గం ప్రజలకి విద్యను అందించడము కోసం మా అన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు 18 యు పి పాటశాలలకి డొనేషన్ ఇవ్వడం, 12 జిల్లా పరిషత్ పాటశాలలకి డొనేషన్ ఇవ్వడం, నవోదయ కళాశాల నిర్మాణం కి 45 ఎకరాల తమ సొంత భూమిని ఇవ్వడం, ఇంజనీరింగ్ కలాశాల నడిపి వేలాదిమంది ఉదయగిరి నియోజకవర్గం విద్యార్దులకి భవిష్యత్ ఇవ్వడం, తదనంతరం గౌతమ్ బాబు కాలం చేశాక 274 కోట్ల విలువ చేసే తమ సొంత ఇంజనీరింగు కలశాల ప్రభుత్వం కి గౌతమ్ బాబు పేరు మీద ఇవ్వడం జరిగింది అని అన్నారు.ఇటీవల జిల్లా మంత్రి ఆనం మాట్లాడుతూ తమ కుటుంబం పై బురద చల్లడానికి ప్రయత్నం చేశారని తమ కుటుంబానికి పెట్టే గుణమే కాని ఆశించడం తెలియదన్నారు. తమకి ఆశించడం అలవాటు కాబట్టే అందరు తమలాగే ఉంటారని అనుకుని బహుశా ఆనం మాట్లాడి ఉంటారని అన్నారు. తాము ఎలాంటి వారిమో ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గం ప్రజలకి తెలుసు అని ఎన్నికకి ఒక నియోజకవర్గం మారే నువ్వా మమ్మల్ని విమర్శించేది అని దుయ్యబట్టారు. ఫీజు రీయంబర్స్ మెంట్ పధకం ద్వారా పేద కుటుంబాలలో నాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి వెలుగు నింపితే ఆయన కొడుకుగా మాజీ ముఖ్యమంత్రి జగనన్న నాడూ నేడు వంటి అనేక నూతన సంస్కరణలు తొ పేద విద్యార్థులు కార్పోరెటు పాటశాల విద్యార్దులకి దీటుగా చదువుకునే అవకాశం కల్పించారు అని అన్నారు.జగనన్న తను ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు పేద విద్యార్థులు డాక్టర్లు కావాలని 17 మెడికల్ కాలేజ్ లు తెచ్చి 5 పూర్తి చేసి, మిగతావి నిర్మాణ దశలో ఉంటే నేడు ప్రయివేటీకరణ పేరుతొ మెడికల్ వంటి విద్యను పేద విద్యార్దులకి దూరం చేసే కుట్ర కూటమి ప్రభుత్వం చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను గాలికి వదిలేసి దాచుకోవడం దోచుకోవడమే పనిగా పెట్టుకుంది అన్నారు.పదవీవిరమణ పొందిన ఆకుల నరసింహా రెడ్డి మిగతా జీవితం కూడా కుటుంబ సభ్యుల తొ కలసి,ఆనమ్దమ్ గా ఆయురారోగ్యాలు తొ గడపాలని మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఆకాంక్షించారు…