
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామ దేవత శ్రీ నూకాలమ్మ తల్లిని భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా పూర్వ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ధన సహాయంతో అమ్మ వారి దేవస్థానానికి మైక్ సెట్ సమర్పించి ఆయనకున్న భక్తిని చాటుకున్నారు.
ఈ సందర్భంగా చిలుకూరి రామ్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో వేంచేసి ఉన్న అమ్మవార్ల గుడి ఉత్సవాలలో కులమాతాలకతీతంగా అందరికీ భాగస్వామ్యం కలిగి ఉంటుందన్నారు. సంవత్సరానికి ఒకసారి నిర్వహించే జాతరలో మానవ సంబంధాలు మెరుగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మిడి వెంకట్రావు, కొల్ల శ్రీనివాస్, నీలి సురేష్,బాలేపల్లి చక్రి,వెలుగుల హరే రామ్ నూకాలమ్మ తల్లి ఆలయ కన్వీనర్ అనపర్తి భాను , టీడీపీ నాయకులు ధనేకుల వీర భద్రరావ్,సంగన ప్రభుజీ, వార్డు నెంబర్చిక్కాల నాని, గ్రామ పెద్దలు తిబిరిశెట్టి సూర్యనారాయణ,కేసరియా హిందూ వాహిని మండల అధ్యక్షులు శిష్టా సుబ్బు , అనపర్తి దుర్గా ప్రసాద్ మరియు ఆలయ కమిటీ పెద్దల చేతుల మీదుగా తదితరుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించియున్నారు .







