
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి డా. ప్రయాగ మూర్తి ప్రగడ అద్వర్యంలో జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అధితిగా ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ కే. వెంకటేశ్వరరావు హాజరై బొటానికల్ గార్డెన్ లో మొక్కలు నాటారు. అలాగే విద్యార్దులకు, విద్యార్ది దశ నుండే సేవ భావం కలిగి ఉండాలని, సేవ చేసే కుతూహలం ఉన్నవారికి జాతీయ సేవా పథకం ఒక మంచి అవకాసమని , కళాశాలలో చవివేటప్పుడు సేవా భావం ఏర్పడితే అది జీవితాంతం ఉంటుందని పది మందికి మంచిచేసే ఆలోచన ఏర్పడుతుందని తెలియజేసారు. కళాశాలను పరిశుభ్రంగా వుంచటం- తోటలు పెంచటం- రోడ్లు వెయ్యటం, పరిసర గ్రామాలను దత్తత తీసుకొని ఆ గ్రామంలో రోడ్లు వేయటం, మురికి వాడలను శుభ్రపరచడం, నిరక్షరాస్యులకి విద్య బోధించడం. ఆరోగ్య సూత్రాలను, వయోజన విద్య ఆవశ్యకతను, జనాభా సమస్య నివారణను ప్రజలకు తెలియజేయడం. వరదలు వచ్చినప్పుడు, అగ్ని ప్రమదాలలోనూ సహాయం చేయడం. ధనవంతుల నుండి విరాళాలు సేకరించి బీదవారికి, అనాథలకు సహాయపడటం. పొదుపు ఆవస్యకతను, అంటు వ్యాధుల వల్ల వచ్చే అరిష్టాలను అరికట్టే విధానాలను ప్రచారం చేయడం వంటి కార్య క్రమాలలో పాల్గొనాలని సూచించారు. ఎస్. ఎస్. పి.ఓ డా. ప్రయాగ మూర్తి ప్రగడ మాట్లాడుతూ ఒక మనిషి మరొక మనిషికి సహకరించడం మానవతా లక్షణంఅన్నారు. అలాగే మనం పదిమందిలో ఉన్నప్పుడు మనవల్ల ఆ పదిమందికీ ప్రయోజనం కల్పించేందుకు కృషి చేయాలి అన్నారు . పరస్పర సహకారంగా, పరోపకారంగా, మంచిగా మెలగటమే సంఘసేవ అని ఎన్. ఎస్. ఎస్ లో ఉంటె మంచి మానవత విలువలు కలిగిన వ్యక్తులుగా ఎదుకుతారని, 1969 సెప్టెంబరు 24న అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ వి.కె.ఆర్.వి.రావు 37 విశ్వవిద్యాలయాలలో జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్) కార్యక్రమాన్ని మహాత్మ గాంధి శతజయంతి సందర్భంగా ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. కళాశాల వాలంటీర్లు అనేక సేవ కార్యక్రమాల తో పాటు అవగాహన కార్యక్రమాలు ద్వారా సమాజ సేవ చేస్తున్నారని, వాలంటీర్లకు అభినందనలు తెలియసేశారు 2024-2025 విద్యా సంవత్సరంలో 38 కార్యక్రమాలు చేశామని తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు కె సురేశ్ , డా. మదీనా, డా. శివ ప్రసాద్, శ్రీలక్ష్మి, వీరభద్ర రావు, డా. బంగార్రాజు, సతీశ్, మేరీ రోజలీనా, పుష్పా, రాజేష్ మరియు అధ్యాపకేత సిబ్బంది సత్యనారాయణ , ధర్మ రాజు , దివ్య,రామలక్ష్మి కమల, కళావతి , పెద్ద సంఖ్యలో విద్యార్దిని విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు.









