పూతలపట్టు సెప్టెంబర్ 19 మన ద్యాస

కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం నూతన చైర్మన్‌గా రెండవసారి ఎన్నికైన మణినాయుడు పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ని ఘనంగా సత్కరించారు. శుక్రవారం ఉదయం విజయవాడలో ఎమ్మెల్యే మురళీమోహన్‌ ని మర్యాదపూర్వకంగా కలిసిన మణినాయుడు దుశ్శాలువాతో సత్కరించి స్వామి వారి చిత్రపటాన్ని, తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్ రెండవసారి కాణిపాకం దేవస్థానం చైర్మన్‌గా ఎన్నికైన మణినాయుడు కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దేవస్థానం అభివృద్ధి, భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. కాణిపాకం దేవస్థానం చైర్మన్ మణినాయుడు శాసన సభ్యులు మురళీమోహన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, స్వామి వారి ఆశీస్సులతో దేవస్థానం అభివృద్ధి దిశగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐరాల మండల అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు, కాణిపాకం మాజీ సర్పంచ్ మధుసూదన్ రావు, నాయకులు హేమాద్రి నాయుడు, జైకుమార్ తదితరాలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *