

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు రసాయన శాస్త్ర విభాగ అధ్యాపకులు ఎస్ రాజేష్ ఆద్వర్యంలో ప్రపంచ ఓజోన్ పొర పరిరక్షణ దినం సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా.డి .సునీత ఓజోన్ పొర పరిరక్షణ గూర్చి విద్యార్డులకు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు ఓజోన్ పొర అనేది సుమారు భూమికి 15 నుండి 35 కిలోమీటర్ల ఎత్తులో కనిపిస్తుందని,భూమి స్ట్రాటో ఆవరణంలో ఉండి, సూర్యుని నుండి వచ్చే హానికరమైన అతినీలలోహిత (యు వి)వికిరణాన్ని గ్రహించి,జీవులను కాపాడే ఒక రక్షణ కవచం అని,ఓజోన్ అణువులు (ఓ3) వాతావరణంలోని ఆక్సిజన్ (ఓ₂)తో అతినీలలోహిత కాంతి చర్య జరపడం వల్ల సహజంగా ఏర్పడతాయని . క్లోరోఫ్లోరోకార్బన్‌లు (సి ఎఫ్ సి) వంటి వాయువులు ఈ పొరను దెబ్బతీయడం వల్ల “ఓజోన్ రంధ్రం” ఏర్పడిందని అయితే అంతర్జాతీయ ఒప్పందాల వల్ల ఇది కోలుకుంటోందని.క్లోరోఫ్లోరోకార్బన్‌లు (సి ఎఫ్ సి), ఏరోసోల్ స్ప్రేలు,కొన్ని రకాల ఫ్రిజ్‌లు,పరిశ్రమలు, మోటారు వాహనాల నుండి వెలువడే కాలుష్యం వల్ల ఓజోన్ పొర దెబ్బతింటుందని . ఓజోన్ పొర క్షీణించడం వల్ల చర్మ క్యాన్సర్, కంటి శుక్లాలు (క్యాటరాక్ట్స్), చర్మం వృద్ధాప్యం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని , అలాగే పంటలకు, సముద్ర జీవులకు కూడా హాని కలుగుతుందని . ఓజోన్ పొరను దెబ్బతీసే పదార్థాల వాడకాన్ని తగ్గించడానికి 1987లో ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు మాంట్రియల్ ప్రోటోకాల్‌పై సంతకం చేశాయిని . పర్యావరణానికి హాని చేయని ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం, సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించడం, మొక్కలు నాటడం, చెట్లను నరకకుండా చూడటం వంటివి ఓజోన్ పొరను రక్షించడంలో సహాయపడతాయి. ఓజోన్ పరిరక్షణ లో అందరం భాగస్వాములమై భావి తరాలకు మంచి మనుగడ వాతావరణం ఏర్పరిచే టట్లు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కె వేంకటేశ్వరరావు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. ప్రయాగ మూర్తి ప్రగడ,డా. మదీనా, శివ ప్రసాద్, లక్ష్మీ,వీరభద్రరావు, డా.బంగార్రాజు,సతీశ్,కుమారి మేరీ రోజలీనా,పుష్పా, మరియు అధ్యాపకేత సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్దిని విద్యార్దులు పాల్గొన్నారు