శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:-
ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి నేత, నరసాపురం పార్లమెంటరీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజును శనివారం ఉదయం ధర్మవరం గ్రామంలో ఆయన నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు.వివరాల్లోకి వెళితే.. మురళీకృష్ణంరాజు తండ్రి రామరాజు పై కూటమినేత లు ఒక మహిళను అడ్డుపెట్టుకుని అక్రమ కేసు పెట్టారని, ప్రత్తిపాడు నియోజకవర్గంలో నేతలు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, నా రాజకీయ జీవితంలో నేను ఎటువంటి అవినీతి చేయలేదని, మీరు అవినీతికి పాల్పడడం లేదని ప్రమాణం చేయగలరా, అవినీతి చేయలేదని రాచపల్లి గల అరుణాచలేశ్వర స్వామి దేవస్థానంలో ప్రమాణం చేస్తారా, నేను శనివారం ఉదయం ఆలయంలో ప్రమాణం చేస్తానని శుక్రవారం జరిగిన.. నిన్న.. విలేకరుల సమావేశంలో ముదునూరి ప్రకటించడం జరిగింది. మాట ప్రకారం ముదునూరి శనివారం తన కార్యకర్తలతో ఆలయానికి బయలుదేరే సమయానికి ప్రత్తిపాడు పోలీసులు ముదునూరి ఇంటికి చేరుకుని ఆయనను గృహనిర్బంధం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇరు పార్టీ నేతలు రాజకీయ సవాళ్లు నైపథ్యంలో కక్షలు పెరగకుండా, ఘర్షణలుజరగకుండా ముందు జాగ్రత్తగా నేతలను గృహనిర్బంధం చేశామని పోలీసులు తెలిపారు.