కావలిలో దాతృత్వం చాటుకున్న డాక్టర్ మంచిగంటి రామస్వామి

మన ధ్యాస ,కావలి ,సెప్టెంబర్ 2:.*పలు ప్రాంతాల్లోని పేదలకు అన్నదానం,200 దుప్పట్లు పంపిణీ.కావలి పట్టణం ప్రముఖ వైద్యులు డాక్టర్ మంచిగంటి రామస్వామి వారి సతీమణి కీ శే మంచిగంటి.లక్ష్మీ రేఖ జ్ణాపకార్థంగా మంగళవారం సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో కావలి పట్టణం పరిసర ప్రాంతాలైన బుడగుంట గిరిజన కాలనీ, సర్వాయిపాలెం గిరిజన కాలనీలలోని గిరిజనులందరికీ అన్నదానం చేయడంతో పాటు 200 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో దాత డాక్టర్ మంచిగంటి రామస్వామి వారి కుమారుడు కోడలు మంచిగంటి.వెంకట సౌరవ్ – రక్షణ మరియు సంస్థ సీనియర్ సభ్యులు ఎం వి ఎన్ ప్రసాదరావు, షేక్ ఖాదర్ భాషా ,సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర పాల్గొన్నారు.ఈ సందర్భంగా సంస్థ సీనియర్ సభ్యులు ప్రసాదరావు, ఖాదర్ భాషాలు మాట్లాడుతూ డాక్టర్ మంచిగంటి రామస్వామి వారి సతీమణి మంచిగంటి లక్ష్మి రేఖ జ్ణాపకార్థంగా పేదలకు అన్నదానము చేయడమే కాకుండా 200 మందికి దుప్పట్లు వితరణ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. డాక్టర్ రామస్వామి అనేక సందర్భాల్లో అనేక రకాలుగా పేదలకు సేవలందిస్తున్న గొప్ప మనసున్న డాక్టర్ అని కొనియాడారు. గతంలో ఓ నిరుపేద కుటుంబానికి వారి సతీమణి జ్ణాపకార్థంగా ఇల్లు నిర్మించి దాతృత్వం చాటుకున్నారని తెలిపారు. సంయుక్త సేవా సంస్థ ద్వారా అనేకసార్లు పేదలకు సేవలు అందించిన మహనీయుడని తెలిపారు. డాక్టర్ రామస్వామి సేవలు మరువలేనివని, ఎందరికో ఆదర్శప్రాయుడని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి కుమారుడు కోడలు వెంకట సౌరవ్ – రక్షణ లను ప్రత్యేకంగా అభినందించారు.కీ శే శ్రీమతి మంచిగంటి.లక్ష్మీ రేఖ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని మనస్పూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నామని తెలిపారు.

  • Related Posts

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..