

మన ధ్యాస ,సంఘం ,సెప్టెంబర్ 2:నెల్లూరు జిల్లా, సంఘం మండలం అన్నారెడ్డి పాళ్లెం గ్రామంలో మంగళవారం విజయ పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం (విజయ డెయిరి)ఆధ్వర్యంలో పాల ఉత్పత్తిదారులకు బహుమతులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు విజయ డెయిరి చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాడి రైతులకు ప్రోత్సాహక బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజయ డెయిరి మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణమోహన్, డెయిరి డైరెక్టర్లు కె చంద్రశేఖర్ రెడ్డి, వెంకటశేషారెడ్డి, డెయిరి అడ్మిన్ శివయ్య, ఫైనాన్స్ సెక్రటరీ శీను తదితరుల తోపాటు పలువురు పాడిరైతులు, డెయిరి సిబ్బంది పాల్గొన్నారు.
