మన ధ్యాస ,కావలి ,సెప్టెంబర్ 2:.*పలు ప్రాంతాల్లోని పేదలకు అన్నదానం,200 దుప్పట్లు పంపిణీ.కావలి పట్టణం ప్రముఖ వైద్యులు డాక్టర్ మంచిగంటి రామస్వామి వారి సతీమణి కీ శే మంచిగంటి.లక్ష్మీ రేఖ జ్ణాపకార్థంగా మంగళవారం సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో కావలి పట్టణం పరిసర ప్రాంతాలైన బుడగుంట గిరిజన కాలనీ, సర్వాయిపాలెం గిరిజన కాలనీలలోని గిరిజనులందరికీ అన్నదానం చేయడంతో పాటు 200 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో దాత డాక్టర్ మంచిగంటి రామస్వామి వారి కుమారుడు కోడలు మంచిగంటి.వెంకట సౌరవ్ - రక్షణ మరియు సంస్థ సీనియర్ సభ్యులు ఎం వి ఎన్ ప్రసాదరావు, షేక్ ఖాదర్ భాషా ,సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర పాల్గొన్నారు.ఈ సందర్భంగా సంస్థ సీనియర్ సభ్యులు ప్రసాదరావు, ఖాదర్ భాషాలు మాట్లాడుతూ డాక్టర్ మంచిగంటి రామస్వామి వారి సతీమణి మంచిగంటి లక్ష్మి రేఖ జ్ణాపకార్థంగా పేదలకు అన్నదానము చేయడమే కాకుండా 200 మందికి దుప్పట్లు వితరణ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. డాక్టర్ రామస్వామి అనేక సందర్భాల్లో అనేక రకాలుగా పేదలకు సేవలందిస్తున్న గొప్ప మనసున్న డాక్టర్ అని కొనియాడారు. గతంలో ఓ నిరుపేద కుటుంబానికి వారి సతీమణి జ్ణాపకార్థంగా ఇల్లు నిర్మించి దాతృత్వం చాటుకున్నారని తెలిపారు. సంయుక్త సేవా సంస్థ ద్వారా అనేకసార్లు పేదలకు సేవలు అందించిన మహనీయుడని తెలిపారు. డాక్టర్ రామస్వామి సేవలు మరువలేనివని, ఎందరికో ఆదర్శప్రాయుడని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి కుమారుడు కోడలు వెంకట సౌరవ్ - రక్షణ లను ప్రత్యేకంగా అభినందించారు.కీ శే శ్రీమతి మంచిగంటి.లక్ష్మీ రేఖ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని మనస్పూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నామని తెలిపారు.