

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: పర్యావరణ పరిరక్షణ లో భాగంగా మార్స్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మరియు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. మార్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధినేత అడపా దుర్గారావు నేతృత్వంలో గత 13 సంవత్సరాలుగా రసాయనిక విగ్రహాలు వద్దు, మట్టి విగ్రహాలు ముద్దు అనే నినాదంతో ఉచితముగా 900 మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతోంది. ఈ సంవత్సరం కూడా మట్టి వినాయక ప్రతిమ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోరాడ రాజు, కటకం కిరీటి, ప్రగడ మధు, కర్రి చైతన్య, నూకరత్నం, రత్నం, వెంకీ, చంటిబాబు, తదితరులు పాల్గొన్నారు.