

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):
ఎగువ ప్రాంతాల నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుకు వస్తున్న వరద తగ్గుముఖం పట్టడంతో గేట్ల ద్వారా నీటి విడుదలను నిలిపివేసినట్లు నీటిపారుదల శాఖ ఏఈ సాకేత్ తెలిపారు.ప్రాజెక్టుకు ప్రస్తుతం 13,590 క్యూసెక్కుల వరదనీరు చేరుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1404.00 అడుగులుగా ఉంది.అలాగే, ప్రాజెక్టు సామర్థ్యం 17.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 16.357 టీఎంసీల నీరు నిల్వ ఉందని వెల్లడించారు.ప్రధాన కాలువ ద్వారా 1,800 క్యూసెక్కుల నీటిని సాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.