Mana News :– నామినేషన్ పేపర్ ను చించాలనుకున్న వారిపై కఠిన చర్యలు తప్పదు ఎస్ఐ సుమన్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ పురం మండలంలో వెంకట పురం పంచాయతీ చెందిన జ్యోతి అనే మహిళా వెంకటాపురం ఎంపీటీసీ వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి ఎస్ ఆర్ పునమినేషన్ వేయడానికి వెళుతుండగా తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త జీవన్ బాబు అనే వ్యక్తి ఆమె మహిళ అని చూడకుండా ఆమెను అడ్డగించి భయభ్రాంతులకు గురిచేసి ఆమె చేతిలో ఉన్న నామినేషన్ పత్రాలను లాక్కేళ్లాడని బాధితురాలు ఫిర్యాదు మేరకు టిడిపి నేత జీవన్ బాబుపై కేసు నమోదు చేసి అతనిని పోలీస్ కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందని అన్నారు.ఎలక్షన్ సమయంలో నామినేషన్ సెంటర్ వద్ద నామినేషన్ పత్రాలను చించాలనుకున్న వారిని ఎంతటి వారైనా వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చట్టపరమైన చర్యలు తీసుకుని వారిని కోర్టులో శిక్ష పడేంత వరకు పర్యవేక్షిస్తామని ఎస్ఆర్ పురం ఎస్ఐ సుమన్ హెచ్చరించారు.