

శంఖవరం /ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:-
మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మండలంలో బవురువాకా గ్రామంలో ప్రసిద్ధిగాంచిన పోతురాజు బాబుకు వైసీపీ నాయకులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ రామిశెట్టి నాని మాట్లాడుతూ నియోజకవర్గంలో కొన్ని దశాబ్దాల కాలం నుండి ముద్రగడ కుటుంబం నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సేవలు అందించిందన్నారు. ముద్రగడ పద్మనాభం ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా నియోజకవర్గానికి చేసిన సేవలను కొనియాడారు. ముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివచ్చి ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దొడ్డి సత్యనారాయణ, బుర్రా కృష్ణ, శేశెట్టి కోదండం, కంచికోట లక్ష్మి, జనమూరి లోవ రాజు, నాని,అప్పారావు తదితరులు పాల్గొన్నారు.