ఆంధ్రప్రదేశ్లో వడ్డెర వృత్తిదారులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు వెంటనే మానుకోవాలి……. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వడ్డెర వృత్తిదారుల కమిటీ సంఘం.

మన న్యూస్, నెల్లూరు, ఆగస్టు 12: ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు జర్నలిస్టు భవనంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించినారు.ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వడ్డెర ఉత్తదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంజి దయాకర్ మాట్లాడుతూ….. రాష్ట్రంలో వడ్డెరలకు రక్షణ కరువైనది కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు వడ్డెరలకు నిత్యం మట్టిపని, కంకర, క్వారీలలో పనిచేసే వారిని వడ్డెర, వడ్డెర వృత్తిదారులకు క్వారీలలో,మైనింగ్ గనులలో మేము అధికారంలోకి వస్తే క్వారీలలో గుట్టలలో సముచితస్థానం కల్పిస్తామని క్వారీలలో సీనరైజ్ చార్జీలు మినహాయించి వడ్డెర వృత్తిదారులను ఆదుకుంటామని వాగ్దానం చేశారు.వడ్డెరలు కొండలు, బండలు, పగలుగొట్టి సమాజానికి ఎంతో ఉపయోగపడే వారికి 50 సంవత్సరాలకే వృద్ధాప్యం పైపడుతుందని , 50 సంవత్సరాలు దాటిన వారికి వృద్ధాప్యం పెన్షన్ ఇస్తామని ఇంకా అనేక వాగ్దానాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చేశారని గుర్తు చేశారు.ఆ వాగ్దానాలు అమలు పరచకపోగా రాష్ట్రంలో వడ్డెర వృత్తిదారులు కుటుంబాలపై స్థానిక కూటమి నాయకులు అనేక అరాచకాలు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అని అన్నారు. ఇటీవల కాలంలో ఉమ్మడి అనంత పురం జిల్లా ,తలుపుల మండలం, పులిగండ్లపల్లి పంచాయతీలో లాజనలపల్లి గ్రామానికి చెందిన పల్లెపు నవీన్ గత పంచాయితీ ఎన్నికలలో రెడ్డి సమాజ వర్గానికి చెందిన సుగుణమ్మకు వ్యతిరేకంగా పనిచేశారని కారణంతో పెత్తందారులైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సుగుణమ్మను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి మెడలో ఉన్న బంగారు చైన్ లో లాక్కొని వెళ్తే ,ఆ దొంగతనం అదే గ్రామస్తుడైన ,వడ్డెర, వడ్డెరదారుల కుటుంబానికి చెందిన పల్లెపు నవీన్ చేశాడని తప్పుడు కేసును బనాయించి ,అగ్రకులానికి చెందిన ఆ గ్రామంలో రెడ్డి లందరూ ఒకటై అధికారంను ఉపయోగించుకుని పల్లెపు నవీన్ పై పోలీసుల చేత తప్పుడు కేసును రిజిస్టర్ చేయించినారు. అగ్రకులానికి చెందిన నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వడ్డెర కులానికి చెందిన పల్లెపు నవీన్ దొంగ తనం చేశాడని , ఒప్పుకోమని లేదంటే మీ కుటుంబ సభ్యులను రకరకాల కేసులు పెట్టి జైలుకు పంపుతామని సంబంధిత సీఐ ,ఎస్ఐ, పోలీస్ స్టేషన్లో అనేక మానసిక ఒత్తిళ్లకు గురిచేసి బెదిరించారన్నారు.ఒప్పుకోకపోవడంతో రాత్రంతా నిర్బంధించి, కొట్టి ,తిట్టి అనేక విధములుగా వేధించారన్నారు. ఆ వేధింపులు భరించలేక సెల్ఫీ తీసుకొని పెట్టి, 28.7.2023 తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు జరిగిందని అని అన్నారు.రెండో సంఘటన నెల్లూరు జిల్లా, సైదాపురం మండలం, కమ్మవారిపాలెం బీసీ కాలనీ చెందిన నిరుపేద వడ్డెర కులానికి చెందిన తురకా మస్తాన్, తురక చిన్న మస్తానయ్య, అచ్చి కృష్ణయ్య ఆ గ్రామానికి అగ్ర కులానికి చెందిన తెలుగుదేశం నాయకుడు కమ్మ పెత్తందారుడు పల్లేటి వెంకటేశ్వర్లు నాయుడు తనకు వ్యతిరేకంగా మాట్లాడాడని,ఆ వడ్డెరల ప్రభుత్వ భూములను తలకొంతా భూమిని గత 40 సంవత్సరాలుగా నిమ్మ చెట్లు వేసుకుని పెంచుకుంటూ కాపుకాస్తున్న సమయంలో 26 జూలై 2025 అధికారాన్ని ఉపయోగించుకొని రెవెన్యూ అధికారులు దాదాపు 30 మంది పోలీసులు బందోబస్తుపై తెలిపిన వడ్డెర కుటుంబాలను పోలీస్ స్టేషన్లలో బంధించి కాయలతో ఉన్న 600 నిమ్మ చెట్లను నెల్లూరు ఆర్డీవో ఆదేశాల మేరకు సైదాపురం మండలం ఎమ్మార్వో వాటిని ధ్వంసం చేసి 26 జూలై 2025 అధికారులే పర్యవరాన్ని ధ్వంసం చేయడం తగునా అని అన్నారు. అధికారం పై కూటమి ప్రభుత్వం నాయకుల పెత్తనం ఏ స్థాయిలో ఉందో ప్రజలే ఆలోచించాలి అని అన్నారు.7 జూలై 2025వ తేదీన రాపూరు మండలం పంగలి గ్రామం, బీసీ కాలనీ వడ్డెర కులానికి చెందిన దేవల్ల అంకయ్య 40 సంవత్సరాలుగా తన కుటుంబ ఆధీనంలో ఉన్న ఐదు సెంట్లు భూమికి సంబంధించి కోర్టు కేసు విచారణలో ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం వెంకటగిరి ఎమ్మెల్యే తన అనుచరుల కోసం రాపూరు మండల ఎంపీడీవో అధికారిని ఉపయోగించుకుని సీఐ ,ఎస్ఐ మరో 20 మంది పోలీసుల బందోబస్తుతో అంకయ్య గ్రామంలో లేని సమయంలో తన భార్య బిడ్డలను నిర్బంధించి, వారి నుండి సెల్ ఫోన్ లాక్కొని, జెసిబి తో చెట్లను ,ఇటుకులను, ఇసుకను ,కంకర బావి వరలాంటి లక్షా 50 వేలు విలువ చేస్తే గృహ నిర్మాణ సామగ్రిని దౌర్జన్యంగా ధ్వంసం చేస్తారు . ఇలా ఎందుకు చేస్తున్నారని సంబంధించిన ఎంపీడీవోను అడగగా నాకు ఎమ్మెల్యే చెప్పారు నేను చేస్తున్నానని చెప్పాడు అని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు వడ్డెరలకు అనేక మాయమాటలు చెప్పి వారి ఓట్లతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈరోజు వడ్డెరలకు ఏమి చేయకపోగా వారిపై అధికార పార్టీ పెత్తందారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు .పల్లెపు నవీన్ ఆత్మహత్య చేసుకోవడానికి సంబంధించిన పోలీస్ స్టేషన్ ఎస్ఐ సి ఐ మరియు పోలీసులపై 306, 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి , వారిని పోలీస్ శాఖ నుండి రిమూవ్ చేసే, మరణించిన నవీన్ కుటుంబ సభ్యులకు 50 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని ,అదేవిధంగా నెల్లూరు జిల్లా, సైదాపురం మండలం వడ్డెర కుటుంబాలకు సంబంధించిన నిమ్మ చెట్లు తొలగించిన ఘటనకు సంబంధించిన ఎమ్మార్వోను ఉద్యోగం నుండి తొలగించాలని ఆ కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి భూమిని వారి స్వాధీనం పరచాలని రాపూరు మండలం పంగళి గ్రామానికి చెందిన ఘటనతో రాపూరు ఎంపీడీవోను ఉద్యోగం నుండి తొలగిం చి ,కుటుంబాన్ని నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చూస్తున్నాం అని అన్నారు. రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో నిత్యము వడ్డెర, వడ్డెర దారులపై అత్యాచారాలు , దౌర్జన్యాలు ,దాడులు జరుగుతూనే ఉన్నాయని వాటిని అరికట్టడానికి సామాజిక రక్షణ చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అని అన్నారు. రాష్ట్రంలో పోలీసులు లైసెన్స్ గుండాలుగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ అదుపుతప్పిందని , లా అండ్ ఆర్డర్ అదుపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.వడ్డెర కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు రాష్ట్రంలో ఉన్న వడ్డెరలంతా ఏకతాటిపై వచ్చి పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోటకొండ వెంకటేష్ ,బెల్లంకొండ బాల వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులు బెల్లంకొండ వెంకయ్య , పంగలి గ్రామానికి చెందిన బాధితుడు దేవల్ల అంకయ్య తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..