గూడూరు, మన న్యూస్ :- బిడ్డ పుట్టిన గంటలోపు తాగే తల్లిపాలు బిడ్డకు టీకా లాంటిదని ఐసిడిఎస్ సిడిపిఓ మెహబూబీ పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా మంగళవారం చెన్నూరు సెక్టార్ చెన్నూరు పార్టీ మిట్ట అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహించారు. ఈ తల్లిపాల వారోత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిడిపిఓ మాట్లాడుతూ తల్లి ముర్రిపాలు బిడ్డకు శ్రేయస్కరమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుందన్నారు. బిడ్డకు తల్లిపాలు ఇచ్చేటప్పుడు ప్రశాంతంగా ఉండాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భవతులు బాలింతలకు అందించే పౌష్టికాహారం ఆరోగ్యానికి శ్రేష్టమని తెలిపారు.అంగన్వాడి కేంద్రాల పరిధిలో ఉన్న బాలింతలు గర్భవతులు పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అనంతరం గర్భవతులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ పి శివ జ్యోతి, పుట్టమ్మ,గిరిజమ్మ, ఆదిలక్ష్మి,కే.లక్ష్మి రత్నమ్మ,గర్భవతులు బాలింతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *