

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్:
అఖిల్ ఐఐటి టాలెంట్ స్కూల్,అఖిల్ జూనియర్ కళాశాల అధినేత ఇనకోటి గంగాధర్ ఆధ్వర్యంలో డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి వారి అనుబంధ సంస్థ సత్య ఐ కేర్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అఖిల్ పాఠశాల,కళాశాల విద్యార్థులతో పాటు పలువురు సిబ్బందికి కంటి వైద్య నిపుణులు ఉచితంగా వివిధ రకాల కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు ఇవ్వడమే కాకుండా అవసరమైన వారికి స్కూల్ అధినేత ఇనకోటి గంగాధర్ కళ్ళజోళ్ళు ఏర్పాటు చేస్తున్నారు.ఈ సందర్బంగా అఖిల్ స్కూల్ అధినేత ఇనకోటి గంగాధర్ మాట్లాడుతూ తమ పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సత్య ఐ కేర్ ఆసుపత్రి వారికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఇనుకోటి సునీత,పాఠశాల అధ్యాపక బృందం,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.