

అనంతపురం: అనంతపురం జిల్లా కేంద్రంలో కార్గిల్ విజయోత్సవ దినోత్సవాన్ని శనివారం హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాతవూరు విజయ క్లాత్ సర్కిల్ నుండి సప్తగిరి సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, దేశ రక్షణ కోసం ప్రాణత్యాగచేసిన.వీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ వేడుకల్లో హిందూ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ, “దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను భవిష్యత్తు తరాలు కూడా మరచిపోలేవు,” అని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ ఉమ్మడి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు వేల్పు మడుగు వీరాంజనేయులు (వీరా), కేశవ్ నాయక్ (బీజేపీ సీనియర్), దాసరి రామమూర్తి, రాణి నగర్ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ చంద్ర శేఖర్, గోల్డ్ స్మిత్ కార్యనిర్వాహణ అధ్యక్షులు రామాంజనేయులు, ఆచారి అనంత అయ్యప్ప అన్నదాన సేవాసమితి సభ్యులు, జీసస్ నగర్ శ్రీనివాసులు, నవోదయ కాలనీ సాయి విశ్వా చారి, పెద్దన్న, విఠ్యోబ్ రావు, చిరంజీవి నాగరాజు, బీజేపీ యువ నాయకులు ఆశావాది రవికుమార్, హిందూ ధార్మిక సభ్యులు శ్రీ విజయ్ కుమార్, హిందూ చైతన్య వేదిక సభ్యులు పాల్గొన్నారు. దేశభక్తి, వీర సైనికుల గౌరవం, యువతలో జాతీయత భావనను పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు.