ఉరవకొండ, మన న్యూస్ :జిల్లాలో ప్రసిద్ధి గాంచిన పుణ్య క్షేత్రమైన పెన్నాహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామీ దేవస్థానం లో తక్షణమే వేద పాఠశాల ఏర్పాటు చేయాలని కోరుతూ శనివారం దేవస్థాన సీనియర్ ఈఓ సాకే రమేష్ బాబుకి రాష్ట్ర గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు మూడ్ కేశవ్ నాయక్ వినతి పత్రం అందజేశారు.
నిత్యం కర్ణాటక,తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్,రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు, పెన్నోబలం లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనం కోసం వస్తుంటారని కేశవ్ నాయక్ పేర్కొన్నారు., దేవస్థానానికి, వేలాదిగా ఎకరాలు భూములు ఉన్నాయని ఆయన తెలిపారు.
దేవస్థానంలో ఒక వేదపాఠ శాల, ఆలాగే వృద్ధాశ్రమం అనాధశ్రేమం గోశాల, ఏర్పాటుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ,
శ్రీ శైలం దేవస్థానంలో వేద పాఠశాల ఉందని గుర్తు చేశారు.
అలాగే పెన్నహోబిలంలో ఏర్పాటు చేస్తే వృద్ధులకు అనాధలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. వేద పాఠశాల ఏర్పాటుతో వేదం చదువుకోవటానికి ఎందరో అభ్యాసకులు వస్తారని ఆశాభావాన్ని కేశవ నాయక్ వెల్లడించారు.