

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: నగర పంచాయతీ 9వ వార్డులో నెయ్యిలి పేటలో నిర్వహిస్తున్న గౌరీ సాంబశివుల ఉత్సవంలో భాగంగా గురువారం నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య గౌరీ సాంబశివులను దర్శించుకుని అమ్మవారికి సారి అందజేశారు. అనంతరం కమిటీ సభ్యులతో ముచ్చటించారు. మత్స్యకార సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు,ఆలయ కమిటీ సభ్యులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గౌరీ సాంబశివుల నిమజ్ఞ కార్యక్రమం డిసెంబర్ 14వ తారీఖున జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య, అలమండ దుర్గాప్రసాద్, బూరెల సత్తిబాబు, చల్లా గణేష్, బోధ చిరంజీవి , బెల్లాన్ని శీను, కడిమిశెట్టి వాసు , అంజూరి రాజారావు, జామి ఆదినారాయణ , బూడి సూరిబాబు, తురోతు సత్యనారాయణ, ఆంబోతు రామారావు, తూరోతు గురయ్యా, గణపతి,మరియు విశ్వహిందూ పరిషత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.