

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: మండలంలోని లింగంపర్తిగ్రామానికి చెందిన శెలపరెడి రాజు బాబు కుటుంబ సభ్యులకు డొక్కా సీతమ్మ వారి సేవా సమితి సభ్యులు తమ సేవా సంస్థ ద్వారా గురువారం రూ.50వేల ఆర్థిక సహాయం అందజేశారు. శెలపరెడి రాజుబాబు హైదరాబాదులో గుడి బొమ్మలు చిక్కుతుండగా ప్రమాదవస్తు కాలుజారి పడిపోవడంతో వెన్నుపూసకు బలమైన గాయం కావడంతో చికిత్స కోసం భారీ మొత్తం ఖర్చవడంతో. ఆ నిరుపేద కుటుంబాని కావడం తో ఆర్థిక సహాయం అందించే దాతల కోసం ఎదురు చూస్తున్నారు. విషయం తెలుసుకున్న ఏలేశ్వరం మండలం మండల కేంద్రానికి చెందిన డొక్కా సీతమ్మవాడి సేవా సమితి సభ్యులు శెలపరెడి రాజుబాబు కుటుంబ సభ్యులను పరమర్శించారు.తమకు తోచిన విధంగా రూ.50వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి జరిగింది, శెలపరెడి రాజుబాబు కుటుంబానికి మనోధైర్యం కల్పించారు. ఈకార్యక్రమంలో.కుర్ర గోవింద్, మెల్లిపాక నాగేంద్ర, నడికట్ల వెంకన్న, సిరిబోలు వీరబాబు, సిరిబోలు శివ, సిరి ఫుడ్ కృష్ణ, ముప్పెనశెట్టి శీను, మోటేపల్లి సూరిబాబు, కోరుకొండ సాయి, బుజ్జి, తదితరులు పాల్గొన్నారు