

- గ్రామాల్లో రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలి
- వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు
శంఖవరం / ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. మండలంలో తోటపల్లి, వెంకటనగరం గ్రామానికి చెందిన వైసిపి నాయకులు కార్యకర్తలు, ప్రత్తిపాడు ఎంపీపీ గొళ్ల కాంతి సుధాకర్, ఎంపీటీసీలు గిరిబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. గిరిబాబు మాట్లాడుతూ గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా గ్రామాల్లో నాయకులు కార్యకర్తలు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రత్తిపాడు లయన్స్ క్లబ్ లో జరిగే రక్తదాన శిబిరంలో పార్టీ శ్రేణులు యువత దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేసి ఆపద సమయంలో ఉన్న వారు రక్తం దొరకకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇబ్బందులు తీర్చడానికి తమ వంతు సహాయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోరాపు గంగరాజు, ఎంపీటీసీ పినిశెట్టి ప్రకాష్, సింద్రపు భాస్కరరావు, యెనుముల దొరబాబు, ఏనుగు పెద్ద, తదితరులు పాల్గున్నారు.