

- ఎమ్మార్పీఎస్ నాయకురాలు గెడ్డం బుల్లమ్మ
- శంఖవరం అరుంధతి కాలనీలో మంద కృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- ఎస్సీ వర్గీకరణ పై మూడు శతాబ్దాల పోరాటయోధుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అని గెడ్డం బుల్లమ్మ కొనియాడారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో మండల కేంద్రమైన శంఖవరం అరుంధతి కాలనీలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవ వేడుకలు, ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా
దండోరా జెండా ఎగరవేసి కార్యక్రమన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకురాలు జి . బుల్లమ్మ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ కు 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1994లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం లో కల్పించిన ఉమ్మడి 15% రిజర్వేషన్ 59 షెడ్యూల్ కులాలు జనాభా ప్రకారం ఉప వర్గీకరణ చేసుకుంటే అన్ని కులాలు రాజకీయంగా ఆర్థిక ఉద్యోగ రాజకీయ అభివృద్ధి చెందుతాయని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి 30 సంవత్సరాలు న్యాయంతో మాదిగల అమరవీరుల ప్రాణ త్యాగం కుటుంబ త్యాగం వ్యక్తిగత జీవిత త్యాగంతో అలుపెరుగని పోరాటం చేస్తే 2024 ఆగస్టు1వ తేదీన 30 సంవత్సరాల ఉద్యమ పోరాట వీరుని పోరాటాన్ని గుర్తించి సుప్రీంకోర్టు ఉపవర్గీకరణ అనుకూలమైన తీర్పు ఇవ్వడంతో మందకృష్ణ మాదిగ మాదిగలకు వేయి తరాల భవిష్యత్తును కల్పించారన్నారు.
అనంతరం ఎమ్మార్పీఎస్ నాయకులు రాయి సూర్యారావు మాట్లాడుతూ, మంద కృష్ణ మాదిగ సాధించిన SCఉప వర్గీకరణలో మాదిగ ఉపకులాలలో ఉన్న యువత విద్యామంతులు నిలిచి SC ఉపవర్గీకరణలో ఉద్యోగాలు ఉన్నతమైన ఉద్యోగాలు సాధిస్తేనే 30 సంవత్సరాల పోరాటానికి గుర్తింపు అని యువతకు సూచించారు. అనంతరం కుండ్రపు నాని నాయుడు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవలందిస్తున్న మహోన్నతమైన వ్యక్తి మంద కృష్ణ మాదిగ అని, భావితరాల భవిష్యత్తు చక్కటి విద్యతోనే సాధ్యమని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ఆచరణలో పెడితే ఎంతటి గొప్ప విజయాన్ని అయినా సాధించవచ్చు అని తెలిపారు. వెనకబడిన వర్గాలకు విద్య చాలా ప్రాముఖ్యమని చక్కటి విద్యను అభ్యసించాలని యువతకు సూచించారు.
అనంతరం మంద కృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో అరుంధతి కాలనీ పెద్దలు ప్రజలు భారీ సంఖ్యలో యువత పాల్గొన్నారు.