సుపరిపాలనకు…తొలి అడుగు విజయవంతం చేయండి…

  • తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పర్వత సురేష్…

శంఖవరం మనన్యూస్ ప్రతినిధి (అపురూప్) :- రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుని, ప్రజలకు ఇది మంచి ప్రభుత్వమంటూ సువరిపాలన అందించడంతో ఇంటింటా సుపరిపాలన… తొలి అడుగు కార్యక్రమాన్ని 30 రోజులపాటు కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందని ప్రత్తిపాడు నియోజకవర్గంటిడిపి సీనియర్ నేత పర్వత సురేష్ తెలిపారు. మండల కేంద్రం శంఖవరంలోని సురేష్ స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సురేష్ మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు శంఖవరం మండలంలోని గ్రామాల్లో ఇంటింటా సుపరిపాలన… తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రతీ ఇంటికి కూటమి నేతలు, శ్రేణులు తిరుగుతూ ప్రజలతో మమేకమై కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పదకాలను వివరిస్తామన్నారు. కూటమి ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా, అన్నా క్యాంటీన్ ఇప్పటికే అమలు చేయగా, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు త్వరలోనే ప్రజలకు అందుతాయని, రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యను పారద్రోలేందుకు ఎన్నో కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయులు కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు చాలా వరకు ఇప్పటికే నెరవేర్చిందని, ఇంకనూ ఏమైనా సమస్యలు, తప్పిదాలు ఉంటే తెలుసుకుని వాటిని సరిచేసేందుకు, ఇంకనూ ప్రజానీకానికి ఏమి చేయాలనే దానిపై ఆలోచన చేసేందుకే కూటమి ప్రభుత్వం ఇంటింటా సుపరిపాలన… తొలి అడుగు కార్యక్రమం చేపడుతుందన్నారు. భారత దేశాన్ని ప్రపంచంలోనేఅగ్రగామిగా నిలిపిన నేత నరేంద్ర మోడి, విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. ఎమ్మెల్యే సత్యప్రభ తన భర్త దివంగత వరుపుల రాజా మరణానంతరం రాజాను నమ్ముకున్న పార్టీ శ్రేణులను, రాజా అభిమానులకు కాపాడుకునేందుకు తన దుఃఖాన్ని,, కుటుంబాన్ని సైతం పక్కకు పెట్టి, నియోజకవర్గం ప్రజలకు అండగా నిలిచి, ప్రత్తిపాడు నియోజకవర్గం మెజార్టీలో మూడు దశాబ్దాల చరిత్రను తిరగరాసి విజయకేతనం ఎగురవేసారన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని రాష్ట్ర మంత్రులు, అధికారులు, ప్రజల సమన్వయంతో అభివృద్ధి చేస్తూ,ప్రజల మన్ననలు సత్యప్రభ అందుకుంటున్నారన్నారు. శంఖవరం మండలంలోని గత వైసిపి పాలనలో కనీసం అభివృద్ధికి నోచుకోకుండా కలగా మిగిలిపోయిన ఎన్నో పనులను సాధించి, సత్యప్రభ అభివృద్ధి చేసి, కూటమి కార్యకర్త ప్రతీ ఒక్కరూ కాలర్ ఎగురవేసేలా సత్యప్రభఅభివృద్ధి బాట పట్టించి, ఒక ధీర వనితగా నిలిచారన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే సత్యప్రభ పాలనపై వచ్చిన సర్వేపై మీడియా మిత్రుడు ప్రశ్నించగా సురేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సత్యప్రభకు వచ్చిన మంచి పేరు, ఆమె చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక ఎవ్వరో చేయించిన సర్వేను పార్టీ కార్యకర్తలుగాని, పార్టీ అధిష్టానం గాని, ప్రజలు గాని విశ్వసించడం లేదన్నారు. నియోజకవర్గం ప్రజలు, టిడిపి కేడర్ ఎమ్మెల్యే సత్యప్రభతోనే ఉన్నారన్నారు. జిల్లాలోనే ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలిపే దిశగా ఎమ్మెల్యే సత్యప్రభ కృషి చేస్తుందన్నారు. త్వరలో చేపట్టే సుపరిపాలన… తొలి అడుగులో పార్టీ శ్రేణులంతా పాల్గొని ఆనందోత్సాహాలు, సంతోషంతో జరుపుకోవాలన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..